‘బాహుబలి’ కుటుంబంలో ఏం జరుగుతుంది..?

bahubali-first-look
ఒకరికి యాక్షన్ ఇష్టం, మరొకరికి కామెడీ ఇష్టం, ఇంకొకరికి పాటలంటే ఇష్టం. థియేటర్లో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఇష్టపడే సన్నివేశాలు ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. హృదయాన్ని కదిలించే శక్తి ఒక కుటుంబ సన్నివేశాలకు మాత్రమె ఉంది. ఆ విషయం దర్శకుడు రాజమౌళికి బాగా తెలుసు. భారి యాక్షన్ సీక్వెన్స్ లు, రాజుల కాలం నాటి కత్తి యుద్దాలు, పోరాటాలు, గుర్రపు స్వారీలు నేపద్యంలో తెరకెక్కిస్తున్న హిస్టారికల్ సినిమా ‘బాహుబలి’లో ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ సన్నివేశాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా ఫ్యామిలీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది. ఆగస్ట్ 20వ తేది వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version