‘ధృవ’కి, ‘8’కి ఉన్న సంబంధం ఏంటీ?

7th, December 2016 - 10:08:37 AM

dhruva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను అలరించేందుకు మరో రెండు రోజుల్లో ‘ధృవ’ సినిమాతో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాపై అభిమానులంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక అభిమానుల ఆశలన్నింటినీ నిజం చేస్తూ, అంచనాలను అందుకునే స్థాయిలోనే సినిమా ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ అయిన ఈ సినిమాలో, ఒరిజినల్‌లో లేని ఒక సర్‌ప్రైజ్ ప్యాకెజ్ ఉందట.

‘ధృవ’ టైటిల్ లోగోనూ సరిగ్గా పరిశీలిస్తే, అందులో 8 అన్న నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ ‘8’ అన్నది సినిమాలో ఒక సరి‌ప్రైజింగ్ ఎలిమెంట్ అట. తమిళంలో లేని ఆ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటన్నది సినిమా చూసే తెలుసుకోవాలని సురేందర్ రెడ్డి అన్నారు. రామ్ చరణ్ తేజ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో నాటితరం నటుడు అరవింద్ స్వామి విలన్‌గా నటించగా, రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.