స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంస్థల పై లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అన్నీ మంచి శకునములే. సంతోష్ శోభన్ హీరోగా మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా గౌతమి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి షావుకార్ జానకి, ఊర్వశి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న అన్నీ మంచి శకునములే రిలీజ్ సందర్భంగా నేడు మీడియాకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో సంతోష్ శోభన్.
ఈ సినిమా ఎలా మొదలైంది?
నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. పేపర్‌బాయ్ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్ లో వచ్చింది అనుకున్నాను. అలా ఈ సినిమా ప్రారంభమైంది.
ఈ సినిమాలో మీకు మెమొరబుల్ సంఘటనలు వున్నాయా?
ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డా ర్లింగ్ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర చేసే అవకాశం యూత్ లో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సీనియర్ గా ఆమె నటనానుభవాలను షేర్ చేసుకున్నారు.
వాసుకిగారు మిమ్మల్ని స్వీటెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు?
అక్కంటే మా వాసుకి లా ఉండాలి అనిపించింది. ఆమె సూపర్. తొలిప్రేమ సినిమా చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్, లైటర్ వే లో సీన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది.
ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కదా? కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశం ఏమిటి?
నందినిరెడ్డి గారితో పనిచేయడం ఎట్రాక్ట్. అలా మొదలైంది సినిమా చూశాక, చాలా కాలం తర్వాత బోనిఫైడ్ రామ్ కామ్ ను అద్భుతంగా తీశారనిపించింది. కథలో ప్రేక్షకుల్ని లీనం చేశారు. ఖుషి,తొలిప్రేమ సినిమాలు చూశాక కళ్యాణ్ గారి నటన బోనిఫైడ్ రామ్ కామ్ లా అనిపిస్తుంది. అలాగే నాకూ నందినిరెడ్డి గారి అలా మొదలైంది చూశాక ఆమెతో సినిమా చేయాలనుకున్నా. అనుకోకుండా ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్ జరిగింది. నాకు అవకాశం రావడం అదృష్టమే.
ట్రైలర్ లో రామ్‌కామ్ అక్కడక్కడా అనిపించింది. మొత్తంగా చూసే మీ యు.ఎస్.పి. ఇందులో ఏమిటి?
ఫ్యామ్ కామ్ (ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునే) లాంటి సినిమా. నందినీరెడ్డిగారు ఒరిజినల్ గా నవ్విసూ ఏడిపిస్తారు. ఈ సినిమాలో ఒరిజినల్ స్ట్రెంత్.. డ్రామా, ఎమోషన్స్, చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలే.
అంతమంది సీనియర్స్ తో పనిచేయడం వల్ల ఏమి నేర్చుకున్నారు?
1950 నాటి షావుకారు జానకి గారి నుంచి కానీ ,2020 లో వున్న నటీనటులనుంచి కూడా చాలా విషయాలు నేర్చుకునే ఛాన్స్ నాకు దొరికింది. రాజేంద్రప్రసాద్ గారంటే లెజెండ్రీ. ఏప్రిల్1 విడుదలలో ఆయన టైమింగ్ ను కాపీ కొట్టి నేర్చుకున్నా.
మీ పాత్రలో ఇంపార్టెంట్ ఏమిటి?
రుషి అనే పాత్ర చేశాను. ఏక్ మినీ కథలో బరువు మోసే పాత్ర చేశాను. ఇందులో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర పోషించాను. నేను ఇలా చేయగలనా! అని అనిపిస్తుంది చాలా మందికి.
నందిని రెడ్డి గారి దర్శకత్వం ఎలా అనిపించింది?
నా స్ట్రాంగ్ జోన్ ఆమె దర్శకత్వం చేయడమే.కామెడీ ఎలా ఉండాలి. ఎంత మోతాదులో చూపించాలి. ఓవర్ కాకూడదు అనేది ఆమెకు బాగా తెలుసు. దర్శకురాలిగా ఆమె బెస్ట్.
మీ పై నాన్నగారి ప్రభావం వుందా?
అది నాన్నగారు ఉన్నప్పుడు పెద్దగా తెలియలేదు. వెళ్ళిపోయాక ఆ ప్రభావం బాగా కనిపించింది. నాన్నగారు మంచి రచయిత. బయట నాన్నగారి గురించి చెప్తుంటే నాకు ఆయనతో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయానా అనే ఫీలింగ్ వస్తుంది.
మాళవిక నటన, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వుంది?
ఆమె కళ్ళతోనే అభినయించగల నటి. చాలా తక్కువ మందికి ఆ ప్రతిభ వుంటుంది. ఈ విషయంలో ఆమెను చూసి ఒక్కోసారి జెలసీగా ఫీలవుతా. ఇక కెమిస్ట్రీ అంటారా. మాది మూడు స్టేజీల్లో కథ నడుస్తుంది. ప్రతి చోటా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది.
మదర్స్ డే సందర్భంగా అమ్మగారి గురించి?
మొన్న టీవీ షోలో కూడా అమ్మగారి గురించి అడిగారు. మాటలు రాలేదు. నటుడిగా సినిమాలు చేయడం ఆమెకు చాలా హ్యాపీగా వుంది. మొదట్లో నటుడిగా చాలా కాలం గేప్ తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలుగుతున్నాను.
కొత్త సినిమాలు?
యు.వి. క్రియేషన్స్ తో చేస్తున్నా. ఆ తర్వాత కొత్త బేనర్ లో చేయబోతున్నా. త్వరలో వెల్లడిస్తా.
ఆల్ ది బెస్ట్ థాంక్యూ