పవన్ ప్రకటన కోసం ఫ్యాన్స్ వైటింగ్..!

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం థమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఐతే పింక్ హిందీ రీమేక్ చేస్తున్నామని చెప్పిన నిర్మాత ఎక్కడా కూడా హీరో పవన్ కళ్యాణ్ అని వ్యక్తపరచలేదు. కానీ ఈ చిత్రం చేయబోతుంది పవన్ కళ్యాణ్ అని అందరికి తెలిసిన నిజం.

ఐతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆయన స్వయంగా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచుస్తున్నారు. ఆయన నోటి నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం పవన్ వీరాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఇవన్నీ పుకార్లని కొట్టిపారేస్తున్నారు. పవన్ పింక్ రీమేక్ లో మాత్రమే కాకుండా మరికొన్ని చిత్రాలలో కూడా నటించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పవన్ సినిమా చేస్తున్నారంటూ ప్రచార మాధ్యమాలలో వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ఖండించకపోవడం ఈ వాదనలను గట్టిపరుస్తున్నాయి.

Exit mobile version