మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ స్పోర్ట్స్ డ్రామానే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో చాలా కాలం నుంచి మిస్సవుతున్న గ్రాండ్ హిట్ గా నిలుస్తుంది అని చాలామంది భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు ఇన్స్టంట్ హిట్ అయ్యాయి. మొత్తం మూడు పాటలు వస్తే మూడూ దుమ్ము లేపాయి. దీనితో తెలుగులో చాలా కాలం తర్వాత తన మ్యాజిక్ చూపించిన రెహమాన్ పెద్ది సినిమాలో కంపోజ్ చేసిన నెక్స్ట్ మాస్ సాంగ్ కోసం అంతా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
మొన్న భోపాల్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫామెన్స్ చేసిన మస్సా మస్సా సాంగ్ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఆరోజు. కానీ ఇప్పుడు సమయం దగ్గర పడుతున్న కొద్దీ దీనిని ఇంకా విడుదల చేయలేదు. పైగా తెలుగు వెర్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చి వదులుతారో చూడాలి.
