డ్రగ్స్ కేసులో ఆ హీరోయిన్స్ కూడా.. ?

Published on Oct 4, 2021 10:00 am IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ లండన్‌ లో సెవెన్‌ వోక్స్‌ లో అలాగే యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేశాడు. కానీ ముంబైలో సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ లో ముగినితేలుతూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కాడు. పోలీసులు ఈ సూపర్ స్టార్ కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు .

అయితే షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం అనే వార్త బాలీవుడ్‌ లో ఒక సంచలనం అయింది. ఇక ఈ క్రమంలో ఆర్యన్ ఫోన్‌ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే, ఆర్యన్ కాల్స్ డేటాను, చాట్స్‌ ను పరిశీలిస్తే.. కొంతమంది యంగ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయని బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం :