అర్జున్ నెక్స్ట్ మూవీ లో విశ్వక్ సేన్ ప్లేస్ లో ఎవరు?

అర్జున్ నెక్స్ట్ మూవీ లో విశ్వక్ సేన్ ప్లేస్ లో ఎవరు?

Published on Nov 6, 2022 6:12 PM IST


ప్రముఖ నటుడు అర్జున్ సర్జా ప్రెస్ మీట్ నిర్వహించి, వివిధ కారణాల వల్ల తెలుగులో తన తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం లో విశ్వక్ సేన్ ఇకపై నటించడు అని ప్రకటించారు. అయితే తన సినిమా పూర్తవుతుందని కూడా చాలా స్పష్టం గా తెలిపారు. దీంతో ఈ సినిమాలో విశ్వక్ సేన్ స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్న అందరిలో తలెత్తింది.

యాక్టర్ అర్జున్, యంగ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ హీరోని పరిగణలోకి తీసుకుంటాడా, లేదా కొత్త హీరోను తీసుకుంటాడా అనే సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా, ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అర్జున్‌ సర్జా తన సొంత బ్యానర్‌ శ్రీరామ్‌ ఫిల్మ్స్‌పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు