విజయ్ “ది గోట్” నుండి విజిల్ ఏస్కో ప్రోమో రిలీజ్!

విజయ్ “ది గోట్” నుండి విజిల్ ఏస్కో ప్రోమో రిలీజ్!

Published on Jul 11, 2024 6:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబర్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి విజిల్ ఏస్కో సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో ఎనర్జిటిక్ గా ఉంది. అభిమానులని అలరిస్తుంది.

మీనాక్షి చౌదరి కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, ప్రశాంత్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు