తలపతి విజయ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘విజిల్’. మంచి ఎమోషన్ తో పాటు బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండటంతో సినిమా మొదటి నాలుగు రోజులు బాగానే వసూళ్లు సాధిస్తోంది. కాగా నైజాంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఐదవ రోజున 12 లక్షల కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఫస్ట్ డే 64 లక్షలను, సెకెండ్ డే 58 లక్షలను, థర్డ్ డే 60 లక్షలను, ఫోర్త్ డే 30 లక్షలను సాధించిన ఫిఫ్త్ డే మాత్రం బాగా పడిపోయింది.
కాగా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ .10 కోట్లకు అమ్ముడయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవడానికి ఇంకా రూ .2 కోట్లు దాకా సాధించాల్సి ఉంది. ఈ వారంలో సాధించే కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ అట్లీ కాంబినేషన్‌లో విడుదలైన తెరి(పోలీస్), మెర్సల్(అదిరింది) చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి కలయికలో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ చిత్రంగా విజిల్ నిలిచింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మించారు.
