రామ్ పోతినేని “ది వారియర్” నుండి విజిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న స్టార్ హీరో!

Published on Jun 22, 2022 12:24 pm IST

రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహు భాషా చిత్రం ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం నుండి విజిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటను తమిళ స్టార్ హీరో సూర్య ఈ రోజు సాయంత్రం 7:12 గంటలకు AMB సినిమాస్ లో డిజిటల్ గా రిలీజ్ చేయనున్నారు. జూలై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :