రామ్ “ది వారియర్” మాస్ సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on Jun 20, 2022 8:07 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన రాబోయే చిత్రం ది వారియర్‌ తో తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కృతి శెట్టి మరియు అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్నారు. జులై 14, 2022న సినిమా థియేటర్లలో విడుదల కానున్నందున ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్.

అందులో భాగంగానే 3వ పాట విజిల్ అనే మాస్ సాంగ్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 22, 2022న సాయంత్రం 07:12 గంటలకు వినీల్ పాటను విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ ద్విభాషా చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఈ సినిమాలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ ద్వారా బ్యాంక్రోల్ చేయబడిన ఈ తెలుగు మరియు తమిళ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :