రామ్ పోతినేని “ది వారియర్” నుండి విజిల్ సాంగ్ రిలీజ్!

రామ్ పోతినేని “ది వారియర్” నుండి విజిల్ సాంగ్ రిలీజ్!

Published on Jun 22, 2022 7:42 PM IST

రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 14 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి మరో మాస్ సాంగ్ విడుదల అయ్యింది. తమిళ స్టార్ హీరో సూర్య ఈ చిత్రం లోని విజిల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ లో రామ్ డబుల్ ఎనర్జీ తో కనిపిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు