తలపతి విజయ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘విజిల్’. మంచి ఎమోషన్ తో పాటు మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండటంతో సినిమా విడుదలై పది రోజులు అవుతున్నా బాగానే వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 రోజులకు గానూ బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల మార్క్ ను దాటింది.
ఇప్పటికీ ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణలోని కొన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. పైగా ఈ రోజు నుండి ఈ చిత్రానికి వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాల కింద లెక్కే. ఎందుకంటే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ .10 కోట్లకు అమ్మారు. ఇప్పటికే పది కోట్లు రాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏజీయస్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మించారు. ఎ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
