మీరు ప్రేమించినంతగా నన్ను ఎవరు ప్రేమించగలరు – సమంత

Published on Mar 27, 2023 11:43 pm IST

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన మూవీ శాకుంతలం. దిల్ రాజు సమర్పణలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అయిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీ పై సమంత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోకూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మరింతగా ఆకట్టుకుని అంచనాలు విపరీతంగా పెంచేసాయి.

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 14న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. అందులో భాగంగా ‘మీకు నేను చెప్పేటంతటి దానిని కాదు, కానీ మీరు మరొక్కసారి ఎవరినైనా ప్రేమించొచ్చు కదా’ అంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కు ఈ విధంగా బదులిచ్చారు సమంత. నిజానికి నన్ను మీరు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించగలరు అంటూ లవ్ ఎమోజి పోస్ట్ చేసారు సమంత. కాగా తమ అభిమాన నటి పెట్టిన ఆ పోస్ట్ పై పలువురు ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :