గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వాని అలాగే అంజలి కలయికలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ పొలిటికల్ డ్రామా చిత్రం “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు నడుమ చాలా కాలం తర్వాత వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి గుడ్ స్టార్ట్ ని అందించింది అని చెప్పాలి.
ఇక ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా సోషల్ మీడియాలో పైరసీలా కూడా కాదు ఏకంగా ఫుల్ హెచ్ డీ క్లారిటీ ప్రింట్ బయటకి వచ్చేసింది. రీసెంట్ గా పుష్ప 2 కి కూడా కొన్ని రోజులు తర్వాత వచ్చింది కానీ ఇలా రిలీజ్ రోజే ఒక పెద్ద సినిమా ప్రింట్ అది కూడా ఫుల్ క్లారిటీ ఉన్నది బయటకి రావడం అనేది షాకింగ్ అని చెప్పాలి. మరి ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఒకింత షాక్ కి లోనవ్వగా అసలు దీనికి భాద్యులు ఎవరు అని వారిస్తున్నారు.
మరి మేకర్స్ నుంచి కూడా ఇలాంటి లీక్ వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో వారు మరింత ఆశ్చర్యానికి లోనవులున్నారు. రెండు మూడు వారాలు తర్వాత ఫుల్ క్లారిటీ ఉన్న ప్రింట్ లే లీక్ అవుతున్నాయి అంటే ఇపుడు ఏకంగా రిలీజ్ రోజుకే ప్రింట్ లు లీక్ అవ్వడం మళ్ళీ మొదలైంది. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారో భాద్యులు ఎవరో అనేది సినీ పెద్దలు సీరియస్ గా తీసుకొని పరిశీలించాల్సిన అంశం అని చెప్పాలి.