ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా మరో స్టార్ ?

Published on Mar 12, 2023 1:00 am IST

జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మొదట సంజయ్ దత్ ను తీసుకున్నారని, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నారని ఇలా చాలా రూమర్స్ వినిపించాయి. మరి విలన్ పాత్ర కోసం ఎవర్ని తీసుకుంటారు అనేది చూడాలి. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే, పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉన్న మరో స్టార్ అయితేనే సినిమాకి ప్లస్ అని మేకర్స్ ఫీల్ అవుతున్నారు.

మొత్తానికి కొరటాల శివ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం :