బిగ్ బాస్ నుండి ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?

అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో ఆరు వారాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఏడవ వారంలోకి ప్రవేశించింది. గత వారం నాగార్జున అందుబాటులో లేని కారణంగా నటి రమ్య కృష్ణ హోస్ట్ గా వ్యవహరించి షో ని రెండు రోజులు ఆసక్తికరంగా నడిపారు.ఇక ఈవారం వైల్డ్ కార్డు ద్వారా శిల్పా చక్రవర్తి ఎంట్రీతో షో ఆసక్తికరంగా మారింది. అలాగే ఈవారం ఎలిమినేషన్ కి గాను, అలీ, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్, రాహుల్ నామినేట్ కబడ్డారు.

గతవారం కూడా ఎలిమినేషన్ లేని నేపథ్యంలో వచ్చే వారం ఖచ్చితంగా ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లనున్నారు. ఈ ఐదుగురిలో అలీ, శ్రీముఖి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇక మిగిలిన ముగ్గురిలో రవి కృష్ణ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం కలదు. ఇక మిగిలిన ఇద్దరు సభ్యులైన రాహుల్, మహేష్ విట్టా లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి ఈవారం ప్రేక్షకులు ఎవరిని సొంతింటికి పంపిస్తారో?.

Exit mobile version