కాబోయే ప్రియుడి గురించి చాలా కలలు కంటుంది కుందనపు బొమ్మ తాప్సి. ఇటివల సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది తాప్సి. మీ ప్రియుడితో డిన్నర్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు అని ప్రశ్నకు సమాధానంగా… ఐదు నక్షత్రాల హోటల్లలో, స్నేహితులతో కలసి క్యాండిల్ లైట్ డిన్నర్ లు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. అందుకే ప్రియుడితో కలసి ‘నీటి మధ్యలో తడవకుండా, గాలిలో ఎగురుతూ పారాగ్లైడింగ్ చేస్తూ చేయాలి అనుకుంటున్నాను’ అని చెప్పింది. ఏదైనా కొత్తగా చేయాలనుంది అంటూ వింత కోరికను వెల్లడించింది. ఇప్పటివరకు ఈ భామ ప్రేమలో పడలేదు. వచ్చే ఆ ప్రేమికుడు తాప్సి కోరిక తీరుస్తాడో..? లేదో..?
‘సాహసం’ తర్వాత తెలుగులో తాప్సి మరో సినిమాను అంగీకరించలేదు. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలలో నటిస్తుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముని 3 – గంగ’ సినిమా తెలుగులో విడుదల కానుంది. ‘రన్నింగ్ షాది డాట్ కామ్’ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తుంది.
