వైరల్ : అందరి చూపు ‘అవతార్ – 2’ ట్రైలర్ వైపు

వైరల్ : అందరి చూపు ‘అవతార్ – 2’ ట్రైలర్ వైపు

Published on Nov 2, 2022 2:08 AM IST


అవతార్, ఈ విజువల్ వండర్ గ్రాండియర్ మూవీ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కి పరిచయం అవసరం లేదు. పండోర గ్రహంలో ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించిన హాలీవుడ్ సృష్టికర్త జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ఈ అత్యద్భుత చిత్రరాజం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న అవతార్ 2 ఫై ప్రకటన వచ్చినప్పటి నుండి ఆడియన్స్, మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ది వే ఆఫ్ వాటర్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఐదు నెలల క్రితం రిలీజ్ అయి యూట్యూబ్ లో అదరగొట్టింది.

కాగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్స్ లో ఎన్నో భాషల్లో రిలీజ్ కానుంది అవతార్ 2. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దానితో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కళ్లన్నీ కూడా అవతార్ 2 ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. మరి ఇప్పటికే అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచిన అవతార్ 2 మూవీ రేపు ట్రైలర్ రిలీజ్ తరువాత, ఆపైన మూవీ విడుదల తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు