మహేష్ బాబు కొత్త సినిమాకు భారీ ఆఫర్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ దాంతో పాటే కొరటాల శివ సారథ్యంలో ‘భరత్ అనే నేను’ చిత్రాల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘స్పైడర్’ ఇంకొద్ది రోజుల్లో ముగియనుండగా ‘భరత్ అనే నేను’ ఈ మధ్యే మొదలైంది. ఇలా చిత్రీకరణ ఆరంభం దశలో ఉండగానే ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. మహేష్ – కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ నెలకొంది.

అందుకే కొందరు ఏపి, తెలంగాణ హక్కుల్ని రూ. 80 కోట్ల ఔట్ రేట్ ధరకు అడుగుతున్నారట. అలాగే హిందీ, తమిళం, ఓవర్సీస్, మలయాళం హక్కులన్నీ కలిపి రూ.40 కోట్లు పలుకుతున్నాయట. దీన్నిబట్టి చూస్తే త్వరలో విడుదలకానున్న ‘స్పైడర్’ గనుక మంచి విజయాన్ని సాధిస్తే ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. మహేష్ సరసన కొత్త నటి కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.