మహేష్ సినిమా ఫస్ట్‌లుక్ ఆలస్యం ఎందుకవుతోంది?

25th, December 2016 - 11:45:20 AM

sonusood

సూపర్ స్టార్ మహేష్, ఇండియన్ సినిమా స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే 70%పైగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఎలా ఉండబోతుందని అభిమానులంతా ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మురుగదాస్ మాత్రం ఇప్పటికీ ఫస్ట్‌లుక్ విడుదల చేయకపోగా, టైటిల్ కూడా ప్రకటించలేదు.

ఇక ఇలా సినిమా ఫస్ట్‌లుక్ విడుదల ఆలస్యం ఎందుకవుతుందనే దానిపై ‘పెళ్ళిచూపులు’తో మంచి పేరు సంపాదించి ఇప్పుడు మహేష్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న ప్రియదర్శి స్పష్టతనిచ్చారు. అందరూ తనను మహేష్ సినిమా ఫస్ట్‌లుక్ ఎప్పుడని అడుగుతున్నారని, అది ఇప్పుడే ఎవ్వరూ చెప్పదల్చుకోలేదని, ఎందుకు ఆలస్యం అవుతుందని కూడా చాలా మంది అడుగుతున్నారని, ఒక అద్భుతమైన సినిమా మీ ముందుకు వస్తూండడంతో కొన్నింటి కోసం ఎదురుచూడాల్సిందేనని ప్రియదర్శి అన్నారు. ఎన్‌.వీ.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. జనవరి 26న ఫస్ట్‌లుక్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.