సినీమాలలో, రాజకీయాలలో వారసత్వం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా ఓక స్థాయికి ఎదిగిన హీరోలు తమ వారసులను సినిమాలలోకి తీసుకురావాలని ఆశపడతారు. అలాగే సదరు హీరో ఫ్యాన్స్ కూడా వారసులొస్తే తమ అభిమానాన్ని అతనికి కూడా పంచుతారు. అసలు హీరో వారసుల అరంగేట్రం కోసం ఎదురు చూసేది ముఖ్యంగా అభిమానులే. దశాబ్దాలుగా రాజకీయంగా, సినిమా పరంగా బడా ఫ్యామిలీ గా, ఘన చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ తీరు వారి అభిమానులను కలవరపెడుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమానులు బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞను తెరపై చూడాలని ఆశపడుతున్నారు.
నందమూరి కుటుంబంనుండి జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఐనప్పటికీ ఎన్టీఆర్ మొదటి నటవారసుడు, స్టార్ హీరో బాలయ్య కొడుకు కూడా రావాలని వారు కోరుకుంటున్నారు. ఐతే మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేకపోవడానికి కారణమేమితో ఎవరికీ అంతుపట్టని విషయం. సాధారణంగా ఒక హీరోకి సొసైటీ లో ఉండే పాపులారిటీ, సెలెబ్రిటీ ఇమేజ్ రీత్యా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి తహతహలాడుతూ ఉంటారు. మరి మోక్షజ్ఞ దీనికి భిన్నంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు అనేది ఆసక్తికరం. వేలకోట్ల సంపాదన ఉన్న ఒక పెద్ద బిజినెస్ మెన్ కి కనీసం ఒక స్టార్ కమెడియన్ కి ఉండే ఇమేజ్, గుర్తింపు ఉండదు. ఎంట్రీ ఇస్తే చాలు నెత్తిన పెట్టుకొనే ఫ్యాన్స్ ఉన్న మోక్షజ్ఞ అడుగులు బిజినెస్ వైపు ఎందుకు పడుతున్నాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. భవిష్యత్తులో నైనా మోక్షజ్ఞ మనసుమారి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం.
