ఏలకంటి విజయ్ దర్శకత్వంలో ‘మంచు లక్ష్మి’ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘w/o రామ్’. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ మంచి సప్సెన్స్ తో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
చనిపోయిన తన భర్త ఎలా చనిపోయాడు ? ఎవరు చంపారు ? అని తెలుసుకోవటానికి ప్రయత్నించే సగటు భార్య పాత్రలో మంచు లక్ష్మి నటించారు. ఈ చిత్రం ఇన్వెస్టిగేట్ తో కూడుకున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మంచు లక్ష్మి నటన కూడా ఈ చిత్రానికి ప్రధాన బలం కానుంది.
ట్రైలర్ చూసిన వాళ్ళు విజయ్ దర్శకత్వం బాగుందంటున్నారు. స్టోరీ ఐడియా దగ్గరనుంచి సౌండ్ ఎఫెక్ట్స్, షాట్ కంపోజింగ్ వరకు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా విజయ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అంటుంది చిత్రబృందం. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన మంచు లక్ష్మి ఈ ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రం మంచి ప్రేక్షకాధరణ పొందుతుందని ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఇంకా చాలా చెయ్యాలనుందని చెప్పుకొచ్చారు.
