అది తెలియాలంటే సినిమా విడుదల వరుకు ఆగాల్సిందే !

నూతన దర్శకుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టచ్ చేసి చూడు. రవితేజ సరసన రాశిఖాన్న, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు ప్రీతమ్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశి మోహన్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.

ఈ సినిమాలో రవితేజ హాలివుడ్ స్థాయిలో ఒక డిఫరెంట్ ఏదో ప్లాన్ చేసాడని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుమ వెల్లడించింది. అదేంటి అనేది తెలియాలంటే సినిమా విడుదల వరుకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. వక్కంతం వంశి అందించిన కథ ఈ సినిమాకు హైలెట్ కాబోతోందని సమాచారం. సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Exit mobile version