ఆ హీరోకి 2020 లోనైనా విజయం దక్కుతుందా..?

adi1

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు యంగ్ హీరో ఆది. ఆయన ఈ ఏడాది ఏకంగా మూడు చిత్రాలు విడుదల చేశారు. బుర్ర కథ అనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఒక చిత్రం చేసిన ఆది, ఆ మూవీ తరువాత శ్రద్దా శ్రీనాధ్ జంటగా జోడి అనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. ఫైనల్ గా అక్టోబర్ లో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఐతే ఒక్క చిత్రం కూడా ఆయనను విజయ తీరాలకు చేర్చలేకపోయింది.

నేడు ఆది పుట్టినరోజును పురస్కరించుకొని మరో మూడు చిత్రాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో ఒకటి శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో రూపొందనున్న ‘శశి’ కాగా ఇంకొకటి జిబి.క్రిష్ణ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మరుధూరి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. 2020లో ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి 2019లో విడుదలైన మూడు చిత్రాలతో విజయం తీరం చేరని ఆది, 2020లో రానున్న మూడు చిత్రాలతోనైనా హిట్ అందుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version