‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ?

‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ?

Published on May 16, 2022 8:15 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. అయితే, ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని గతంలోనే టాక్ నడిచింది. అయితే, ఈ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ఇది నిజం అని తెలుస్తోంది. మరి ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ మళ్లీ ఫిక్స్ అయితే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఇక ఈ సినిమా ఒక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. ఏది ఏమైనా ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు అంటే.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు