రామ్ చరణ్ తన న్యూ లుక్ ని కంటిన్యూ చేస్తాడా.?

ram_charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మొదటి సారిగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో రామ్ చరణ్ న్యూ లుక్ కి అభిమానుల నుంచే కాకుండా సినిమా లవర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ లుక్ లో చరణ్ పోనీ టెయిల్, లైట్ గా ఉన్న గడ్డంతో చరణ్ చాలా యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ చరణ్ కి ఉన్న లుక్ ని పూర్తిగా మార్చేసింది.

దాంతో ఈ సినిమాలో ఉన్న న్యూ లుక్ ని చరణ్ కంటిన్యూ చేస్తాడా? అని అందరూ అనుకుంటున్నారు.. కానీ చరణ్ సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారం పోనీ టెయిల్ మాత్రం తీసేస్తారు, లైట్ గా ఉన్న గడ్డం లుక్ మాత్రం కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version