టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రమే ఓం – చాప్టర్ 1. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి, సాయి పల్లవి అలాగే శ్రీలీల తదితరులు నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో మంచి బజ్ రేకెత్తించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అక్టోబర్ 16కి లాక్ చేసేసారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ధనుష్ కొత్త డేట్ ని వెతుక్కోవాల్సిందే అని అనిపిస్తుంది. ఎందుకంటే దసరా బరిలో అటు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ విశ్వంభర సినిమాలు రావడం ఖాయం అయ్యింది. సో ఈ క్లాష్ లో ధనుష్ సినిమా కూడా వస్తే డ్యామేజ్ గ్యారెంటీ. సో ఆ సినిమా కొత్త డేట్ ఫిక్స్ చేసుకోక తప్పదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా ధనుష్, శ్రద్దా అగర్వాల్ లు నిర్మాణం వహిస్తున్నారు.
