హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. కాగా ఈ సినిమా షూటింగ్ ను జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. కాకపోతే, శర్వానంద్ లేకుండానే ఈ షూటింగ్ జరగనుంది. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, నటి లయ’ పై ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మొదటి షెడ్యూల్ లో శర్వానంద్ జాయిన్ కాడు అట. జూన్ చివరి వారంలో జరిగే రెండో షెడ్యూల్ లో శర్వానంద్ జాయిన్ అవుతాడట.
ఇక ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నాడు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
