మళ్లీ గోపీచంద్ తోనే ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ ?

Published on Jul 26, 2022 12:00 am IST

డైరెక్టర్ ‘సంపత్ నంది’ కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రవితేజ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు హీరో గోపీచంద్ కి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, గోపీచంద్ కి కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

ఒకవేళ నిజం అయితే.. మరి గోపీచంద్ ఇమేజ్ కోసం సంపత్ నంది ఈ సారి ఎలాంటి కథ రాశాడో చూడాలి. ఇక గతంలో గోపీచంద్‌ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో ‘సిటీమార్’ సినిమా వచ్చింది. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :