గౌతమ్ మీనన్ మ్యాజిక్ తెలుగులోనూ పనిచేస్తుందా?

Yentha-Vaadu-Gaani
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఎన్నై అరిందాళ్’. గత ఫిబ్రవరి నెల్లో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాను ‘ఎంతవాడు గానీ..’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (మే 22న) విడుదల కానుంది.

పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అజిత్, త్రిష, అనుష్క ఇలా లీడ్ క్యారెక్టర్స్ అందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కావడం ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు.

దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉండడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చే అంశం. గతంలో ఆయన సినిమాలు ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావే’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లాంటి సినిమాలు ఆయనకు తెలుగులో ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. గౌతమ్ మీనన్ మ్యాజిక్‌పైనే తెలుగులో ఈ సినిమా సక్సెస్ సాధించడం ఆధారపడి ఉంది. మరి తమిళంలో ఆయన చేసిన మ్యాజిక్ తెలుగులోనూ పనిచేస్తుందా తెలియాలంటే రేపటి వరకూ ఎదురు చూడాల్సిందే!

Exit mobile version