దసరా కోసం బాలయ్య , మహేష్ బాబుల పోటీ ?


పండుగ సీజన్ లో సినిమా విడుదలైతే నిర్మాతలకు లాభిస్తుంది. పండుగ రోజున సినిమా చూడాలనుకునే అభిమానులు ఎక్కువగా ఉంటారు.రాబోయో దసరా పండగకి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పోటీపడనున్నట్లు తెలుస్తోంది. అటు బాలకృష్ణ, ఇటు మహేష్ బాబు తమ చిత్రాలను దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య 101 వ చిత్రం ‘పైసా వసూల్’ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న విషయం తెలిసిందే.బాలయ్య అభిమానులతో పేస్ బుక్ లైవ్ లో భాగంగా పూరి ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. పైసా వసూల్ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 29 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా మహేష్ బాబు స్పైడర్ చిత్రాన్ని కూడా దసరాకే విడుదలచేయనున్నట్లు గతంలో తెలిపారు. కానీ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. దీనితో బాలయ్య, మహేష్ బాబుల చిత్రాలు మధ్య పోటీ ఎలా ఉంటుందనే అంశం ఆసక్తిగా మారింది.