“అవతార్ 2” తో కేమెరూన్ ఈ బిగ్గెస్ట్ ఫీట్ సెట్ చేస్తారా?

“అవతార్ 2” తో కేమెరూన్ ఈ బిగ్గెస్ట్ ఫీట్ సెట్ చేస్తారా?

Published on Dec 18, 2022 9:20 PM IST


ప్రస్తుతం ప్రపంచ సినిమా అంతా కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న భారీ విజువల్ వండర్ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. మరి దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ అండ్ ఎమోషనల్ డ్రామా సాలిడ్ టాక్ తెచ్చుకుని ఇండియా లో కూడా రెండు రోజుల్లో సుమారు 100 కోట్ల మేర వసూళ్లు కొల్లగొట్టింది.

అయితే ఈ సినిమాపై ఉన్న హైప్ అలాగే దర్శకుడు కేమరూన్ గత సినిమాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ లతో పైగా అవతార్ కి సీక్వెల్ ఈ చిత్రం కావడంతో ఈ సినిమా వసూళ్లు ఏ లెవెల్లో ఉంటాయా అని అంత ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమా తన అవతార్ 1 వసూలు చేసిన 2.8 బిలియన్ టార్గెట్ తో రెడీ కాగా..

వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి 1 బిలియన్ అలాగే 2 బిలియన్ మార్కెట్ ని ఓపెన్ చేసిన ఈ సెన్సేషనల్ దర్శకుడు ఇప్పుడు అవతార్ 2 తో అయితే 3 బిలియన్ మార్కెట్ ని కూడా తానే ఓపెన్ చేస్తారా అనే ప్రశ్న ఆసక్తిగా మారింది. మరి కేమరూన్ ఈ సెన్సేషనల్ ఫిగర్ ని కూడా టచ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు