ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కానున్న ‘జనగణమన’ ?

Published on Feb 28, 2022 9:15 pm IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ప్రస్తుతం ‘లైగర్’ సినిమా వస్తోంది. అయితే, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నాడు. ‘జనగణమన’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని.. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ స్క్రిప్ట్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నాడు పూరి.

ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను ఏప్రిల్‌ లో స్టార్ట్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో తొలి షెడ్యూ ల్‌ ను, మే లో సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక లైగర్ సినిమా అవుట్ ఫుట్ విజయ్ కి చాలా బాగా నచ్చిందని, అందుకే, లైగర్ తర్వాత కూడా పూరితోనే మరో సినిమా చేయాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడట.

మొత్తానికి లైగర్ విడుదలకు ముందే కొత్త సినిమా సంగతులు చెప్పాడు పూరి. పైగా లైగర్ విడుదలకు ముందే ఈ కొత్త సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు. మరి లైగర్ కంటే ముందే “జన గణ మన”ను పూరి ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :