Kanguva: “కంగువా”తో తెలుగులో సూర్యకి పూర్వ వైభవం వస్తుందా?

Kanguva: “కంగువా”తో తెలుగులో సూర్యకి పూర్వ వైభవం వస్తుందా?

Published on Oct 25, 2024 10:09 AM IST


తమిళ్ నుంచి ఉన్న పలువురు స్టార్ హీరోస్ కి మన తెలుగు సినిమా దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు వారి సంఖ్యపెరిగింది. కానీ ఎప్పుడు నుంచో మంచి క్రేజ్ ఉన్న అతి తక్కువ మంది నటుల్లో కమల్ హాసన్, రజినీకాంత్ లతో పాటు సూర్య కూడా ఒకరు. మరి తమిళ్ లో తాను చేసిన సినిమాలు ఎన్నో ఏళ్ళు నుంచే తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి మంచి వసూళ్లు కూడా సాధించాయి.

అలా తెలుగు స్టేట్స్ కి అడాప్టెడ్ సన్ అంటూ పిలవబడే సూర్య సాలిడ్ కం బ్యాక్ కోసం చూస్తున్నాడు. తాను నటించిన లాస్ట్ సినిమాల్లో “గ్యాంగ్” తెలుగులో హిట్ అయ్యింది. అయితే ఇపుడు తన భారీ సినిమా “కంగువా” తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకి తెలుగులో ప్రమోషన్స్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. సూర్య తెలుగు ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమ చూసి ఒకింత ఎమోషనల్ కూడా అయ్యిపోయాడు.

అలాగే తన హిట్ చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ లో తెలుగు ఆడియెన్స్ భారీ వసూళ్లు అందించారు. ఇక ఇపుడు కంగువా బజ్ కూడా తెలుగులో గట్టిగానే మొదలయ్యింది. మరి ఈ సినిమాకి టాక్ గాని పడితే మళ్ళీ సూర్య తెలుగులో పూర్వ వైభవం చూస్తాడని చెప్పడంలో సందేహం లేదు. మరి చూడాలి కంగువా కి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు