‘స్వామి రారా’ మేజిక్ కి కృష్ణ టైటిల్ రిపీట్ చేస్తుందా.?

Mosagallaku-Mosagadu (1)
చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘స్వామి రారా’. ఈ సినిమాని నిర్మించిన చక్రి చిగురుపాటి ఈ సినిమాకి సీక్వెల్ గా ఓ సినిమాని మొదలు పెట్టాడు. ఘట్టమనేని హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారి అలనాటి సూపర్ హిట్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ని పెట్టిన సంగతి ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణరావు, అల్లరి నరేష్, నవీన్ చంద్ర, సుదీర్ పాబు తదితరులు హాజరయ్యారు.

నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మామూలుగా స్వామి రారా సినిమా కేరళ గుడిలో నుంచి బయటకి వచ్చిన ఓ గణేష్ విగ్రహం చుట్టూ తిరిగితే, మోసగాళ్ళకు మోసగాడు సినిమా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో 12వ శతాబ్దానికి చెందిన శ్రీరాముడు – సీత విగ్రహాల చుట్టూ తిరగనుంది. సినిమాని కూడా చాలా గ్రాండ్ గా మలేషియా, బ్యాంకాక్ లలో షూట్ చేసారు. విజువల్స్ కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎఎన్ బోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మనికాంత్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version