“బిగ్ బాస్ 5” తో మళ్ళీ నాగ్ తన రికార్డ్ బ్రేక్ చేస్తారా?

Published on Sep 5, 2021 10:00 am IST


మన తెలుగు మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభం కి సమయం ఆసన్నం అయ్యింది. ఇంకొన్ని గంటల్లో మొదలు కానున్న ఈ గ్రాండ్ షో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి గత రెండు సీజన్లను అద్భుతంగా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ చేస్తుండడంతో అంతే బజ్ నెలకొంది. అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ షోకి ప్రత్యేక ఆదరణ ఉందని చెప్పాలి.

ఒక్కో సీజన్ పెరుగుతున్న కొద్దీ షో క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అలానే నాగ్ హోస్ట్ చేసిన లాస్ట్ రెండు సీజన్ల స్టార్టింగ్ ఎపిసోడ్స్ కి రికార్డు స్థాయి టీఆర్పీ వచ్చింది. మరి తన రికార్డు ని తానే బ్రేక్ చేసిన నాగ్ ఇప్పుడు కూడా బ్రేక్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మరి గత సీజన్ కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ కి 18.5 టీఆర్పీ రాగా ఇప్పటికి ఇదే హైయెస్ట్ గా ఉంది. మరి దీనిని మళ్ళీ నాగ్ బ్రేక్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :