నాని “దసరా” అంచనాలను అందుకుంటుందా?

Published on Mar 28, 2023 8:48 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. పాన్ ఇండియా మూవీ గా మార్చ్ 30 న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం హీరో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ ను గట్టిగానే చేసింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఇది హీరో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్.

అయితే నాని నటించిన దసరా చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది. సినిమాకి సంబందించిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియో లకు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి మంచి హైప్ ఉండటం తో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే లాంగ్ రన్ లో సాలిడ్ గా వసూళ్లను రాబట్టాలంటే మంచి పాజిటివ్ టాక్ రావాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఈ చిత్రం లో నాని సరసన స్టార్ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని, జరీనా వహాబ్‌, సాయికుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :