తరువాతి సినిమాలో నాని ద్విపాత్రాభినయం?


తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసే హీరోలని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. సినిమాలో రెండు పాత్రలు చేయాలంటే అది కచ్చితంగా తలకు మించిన భారమే అవుతుంది. రెండు పాత్రల్లో ఎ ఒక్కటి తగ్గిన ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అయితే నాని అప్పుడే మూడో సారి ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే జెండాపై కపిరాజు, జెంటిల్మెన్ సినిమాల్లో నాని ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. అందులో ఒక సినిమా హిట్ అవగా మరో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సారి యువ దర్శకుడు వినోదం పండిచడంలో టాప్ అనిపించుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాకి నాని పచ్చజెండా ఊపాడు. అయితే ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో మెరిసే అవకాశం వుందని ఇప్పుడు చిత్రవర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇందులో క్లేరిటి ఎంత అనేది నాని ఇంకా చెప్పాల్సి వుంది.