ఆ బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా ?


అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మాహానటి’ పేరుతో ఒక బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలాం పాటు ఈ సినిమా స్క్రిప్ట్ మీద పనిచేసిన అశ్విన్ మే 29న సినిమా మొదలుపెట్టాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మరొక ఇంపార్టెంట్ రోల్ లో సమంత నటిస్తుండటం వలన బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా గురించిన మరొక వార్త అందరిలోను ఆసక్తిని రేపుతోంది.

అదేమిటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశముందట. ఈ మేరకు చిత్ర టీమ్ తారక్ ను కలిసి చర్చలు జరుపుతున్నారని, ఇంకా తుది నిర్ణయం కాలేదని అంటున్నారు. మరి ఈ చర్చలన్నీ సఫలమై ఎన్టీఆర్ తన తాతగారి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.