ఇంటర్వ్యూ : కళ్యాణ్ రామ్ – ఇక పై నా నుండి ఇలాంటి డిఫరెంట్ సినిమాలే వస్తాయి !

kalyan-ram
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘ఇజం’. ఫస్ట్ లుక్స్, టీజర్లతోనే భారీ అంచనాల్ని రేకెత్తించిన ఈ చిత్రంలో పూరి మార్క్ మ్యానరిజంతో కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపిస్తూ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచారు. వైవిధ్యభరితమైన కథా, కథనాలతో రూపొందిన ఈ చిత్రం రేపే విడుదలవుతున్న సందర్బంగా హీరో కళ్యాణ్ రామ్ తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం

ప్ర) ఇజం.. ఇజం.. అంటున్నారు. ఆ ఇజం ఏంటో కాస్త చెప్తారా ?

జ) ఇజం అంటే ఒక సిద్ధాంతం. ఒక వ్యక్తిగాని, కొందరు వ్యక్తులుగాని ఆ ఇజాన్ని ఫాలో అవుతూ సొసైటీకి మంచి చేయాలని అనుకుంటుంటారు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాంటిదే. ఒక సామాజిక సిద్ధాంతంతో సమాజానికి మంచి చేయాలనేదే నా ఇజం.

ప్ర) ఇప్పటికి చాలా సోషల్ సినిమాలొచ్చాయి. వారికి మీ సినిమాకి తేడా ఏంటి ?

జ) అవును.. ఇప్పటికే చాలా సోషల్ సబ్జెక్ట్స్ వచ్చాయ్. మాది కూడా అలాంటిదే. కానీ ఇక్కడ పూరిగారిచ్చిన ముగింపు చాలా కొత్తగా ఉంటుంది. ప్రతిఒక్కరికి సొల్యూషన్ చాలా పాజిబుల్ గా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అవును ఇలా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు. చాలా రియలిస్టిక్ గా, అందరికీ కనెక్టయ్యే విధంగా ఉంటుంది ఎండింగ్.

ప్ర) సాధారణంగా జర్నలిస్ట్ అంటే సిక్స్ ప్యాక్ అంత అవసరం లేదు కదా. మీరెందుకు ట్రై చేశారు ?

జ) సిక్స్ ప్యాక్ అనేది నా ఫిట్నెస్ కోసం చేసింది. ఎవరైనా సరే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే మెంటల్ గా ఫిట్ గా ఉంటారు. సినిమాలో నా పాత్ర మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకోసమే ఈ సిక్స్ ప్యాక్. పైగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే రిస్క్ కదా. అందుకే సిక్స్ ప్యాక్.

ప్ర) సినిమా కోసం పూరిగారు ఏం చెప్తే అదే విన్నారా ?

జ) అదేం లేదు. అసలు పూరిగారు అలా ఉండు ఇలా ఉండు అనే రిస్ట్రిక్షన్స్ చెప్పలేదు. క్యారెక్టర్ నీలానే ఉంటుంది. కాబట్టి నువ్వు నీలానే ఉండు చాలు అన్నారు.

ప్ర) పూరిగారు చాలా స్పీడ్ కదా. ఆయనతో ఎలా పని చేశారు ?

జ) పూరిగారు చాలా స్పీడ్. కానీ ఆ స్పీడుకు తగ్గట్టే అవుట్ ఫుట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే ఆయనతో పని చేయడం చాలా ఈజీగా, ఇష్టంగా అనిపించింది.

ప్ర) ఇక పై నుంచి ఇలాంటి డిఫరెంట్ సినిమాలే వస్తాయని ఆశలు పెట్టుకోవచ్చా ?

జ) ఖచ్చితంగా.. ఎందుకంటే డిఫరెంట్ గా లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడట్లేదు. కాబట్టి ఇకపైన కూడా ఇలాంటి సినిమాలే చేస్తాను. కాబట్టి నా మీదా ఆశలు పెట్టుకోవచ్చు.

ప్ర) టీజర్ చాలా కొత్తగా ఉంది. సినిమా అంటా అలానే ఉంటుందా ?

జ) మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. థియేటర్లో సినిమా చూసి షాకవుతారు.

ప్ర) పూరిగారితో మీ జర్నీ ఎలా సాగింది?

జ) పూరిగారు, నేను నెలపాటు ట్రావెల్ చేశాం. నా గురించి అంతా తెలుసుకునే నాకీ కథ చెప్పారు. పూరిగారితో పని చేయడం చాలా కొత్తగా ఉంది. సినిమా మొత్తం చాలా ఇష్టంగా పనిచేశాను. నిజంగా నాలోని నటుడిని ఆయన 100 రెట్లు ఎక్కువ చేశారు. సినిమా హిట్టయితే అది పూరిగారికే అంకితం.

ప్ర) సాయి ధరమ్ తేజ్ తో సినిమా సంగతేంటి ?

జ) ఆ సినిమా ఉంటుంది. కానీ ఇంకా స్క్రిప్ట్ డిస్కషన్స్ జరగవుతున్నాయ్. ఓకే అయితే ఖచ్చితంగా చెప్తాను.

ప్ర) పూరి గారు ఈ కథకి మీరైతేనే సరిపోతారన్నప్పుడు ఎల్లా ఫీలయ్యారు ?

జ) పూరిగారు ఆ మాటన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో నా నటనకు అవార్డేమైనా వస్తే అది పూరిగారికే ఇవ్వాలి.

ప్ర) ఇంకా ఈ సినిమాలో ఏమైనా కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయా ?

జ) ఇందులో సోషల్ ఎలిమెంట్ ఒక్కటే కాదు. పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అలాగే హీరో ఫ్యామిలీని శాక్రిఫైజ్ చేస్తాడు. ఇది మూడు లేయర్లున్న సినిమా.