‘జాగ్వార్’ ఆడియో లాంచ్‌కు పవన్?

pawan

మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వర్’ అనే ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను సెప్టెంబర్ 18న హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిఖిల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్లాన్ చేశారట. ఇక ఈ నేపథ్యంలోనే తన కుమారుడు నిఖిల్ సినిమా ఆడియో లాంచ్‌కు రావాల్సిందింగా కుమారస్వామి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ను కోరారట.

ఈ ఉదయం హైద్రాబాద్‌లో పవన్‌ను స్వయంగా కలిసిన కుమారస్వామి, ఈ సందర్భంగానే ఆడియో లాంచ్‍కు హాజరు కావాల్సిందింగా కోరారట. ఆడియో ఫంక్షన్స్‌కు ఎప్పుడూ పెద్దగా హాజరు కాని పవన్ కళ్యాణ్, ఈ ఆడియో లాంచ్‌కు హాజరయ్యేలా చూస్తానని కుమారస్వామితో అన్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఆహ్వానించడం కోసం మాజీ సీఎం స్వయంగా రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.