పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందిందా ?

pawan-khaidi
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ సంక్రాంతి విడుదల సందర్బంగా టీమ్ జనవరి 4వ తేదీన విజయవాడలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 9 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. కాబట్టి నాగబాబు, చరణ్, బన్నీ, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అందరూ ఈ వేడుకకు హాజరై అభిమానులకు కనుల పండుగ చేయనున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తాడా, రాడా అనే సందేహంతో పాటు వస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఫ్యాన్స్ అందరి మనసులో మెదులుతోంది.

అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువున్నాయని, చిరు ఇప్పటికే పవన్ కు ఆహ్వానం కూడా పంపారని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా గతంలో చిరు పవన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు హాజరయ్యారు. దాంతో వారి మధ్య మంచి సఖ్యత ఉందని తేలిపోయింది. కనుక మెగా వేడుకకు పవన్ హాజరయ్యే తీరుతారని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.