‘ఫౌజీ’లో ప్రభాస్ అలా కనిపిస్తాడా..?

‘ఫౌజీ’లో ప్రభాస్ అలా కనిపిస్తాడా..?

Published on Jan 21, 2025 12:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, దీంతో పాటు ఆయన ఈ సినిమాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడట. ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ మధురై సమీపంలోని కారైకుడి ప్రాంతంలో జరగనుంది. ఇక్కడ దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట.

ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు సాగనుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు