ఇటీవల సౌత్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “ప్రేమలు” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో నాస్లన్ కే గఫుర్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా నటించగా గిరీష్ ఎడి దర్శకత్వం వహించారు. అయితే ఈ రోమ్ కామ్ డ్రామా తెలుగులో వచ్చి కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేయడం విశేషంగా మారింది.
ఈ సినిమాకి ఓటీటీ లో వచ్చాక థియేట్రికల్ గా వచ్చిన మాదిరిగా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చేయలేదు. పైగా ఇప్పుడు ఉన్న సినిమా లోనే క్లీన్ ఎండింగ్ ఉంది పార్ట్ 2 కి స్కోప్ కూడా లేదు. అలాంటప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేసిన సీక్వెల్ ఫోర్స్డ్ గా కేవలం క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికే అని కొంతమందికి అనిపించవచ్చు. మరి చూడాలి ఈ రానున్న రెండో సినిమా ఎలా ఉంటుంది అనేది.