ఇండియన్ సినిమా గర్వించదగ్గ పలు భారీ ప్రాజెక్ట్ లలో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రాజెక్ట్ “వారణాసి” కూడా ఒకటి. తన గ్లోబల్ సెన్సేషన్ “రౌద్రం రణం రుధిరం” సినిమా ఆస్కార్ వరకు వెళ్లి తనకి భారతీయ సినిమాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.
బాహుబలి, RRR వరకు రాజమౌళి గ్లోబల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ మాత్రం కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా స్ట్రైట్ గా పాన్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లోకే వెళ్లే విధంగా ఊహించని ప్లానింగ్స్ వేస్తున్నారు.
ఐమ్యాక్స్ వెర్షన్ లో అనౌన్స్ చేయడం నుంచి పలు అంతర్జాతీయ మీడియాలలో ఇప్పుడు నుంచే వారణాసి కోసం మాట్లాడే విధంగా తన సినిమాని ప్రెజెంట్ చేశారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో తన సినిమాకి ఒక గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక మరోసారి ఆస్కార్స్ వరకు వెళ్లారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం 98వ అకాడమీ అవార్డు విన్నర్స్ లిస్ట్, ఆ హడావుడి నడుస్తుంది. 2027లో వారాణసి విడుదల కానుండగా 2028 ఆస్కార్ బరిలో డెఫినెట్ గా ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. మరి జక్కన్న మరోసారి తన పేరిట చరిత్ర లిఖిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.
