‘మోగ్లీ’: ‘రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రాటజీ కలిసొస్తుందా?

mogi

ఈ వారం థియేటర్స్ లో సందడి చేసుందుకు వస్తున్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలయ్య నటించిన చిత్రం అఖండ 2 తో పాటుగా రోషన్ కనకాల అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన యూత్ ఫుల్ చిత్రం మోగ్లీ కూడా ఒకటి. ఇలాంటి క్లాష్ లో మోగ్లీ పై కూడా మంచి బజ్ అయితే నెలకొంది.

ఈ క్రమంలో మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకోవడం కూడా జరిగింది. అదే ఈ సినిమాకి చాలా సాధారణ టికెట్ ధరలు పెట్టడం జరిగింది. సింగిల్ స్క్రీన్స్ లో మోగ్లీ కేవలం 99 రూపాయలు (గరిష్ట ధర)తో మాత్రమే రాబోతుంది. కూడా నిజంగా ఓ మంచి మూవ్ కాగా ఇదే స్ట్రాటజీతో ఇటీవల చిన్న సినిమానే అయినా పెద్ద విజయం సాధించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి కూడా వచ్చింది.

ఆ సినిమాకి ఈ ధరలు చాలా ప్లస్ అయ్యాయి. మంచి టాక్ పడడంతో ఆ సినిమా అదిరే రెస్పాన్స్ ని కూడా అందుకుంది. సో మోగ్లీ కి కూడా ఇదే తరహా రెస్పాన్స్ వస్తుందో లేదో అనేది ఈ 13 వరకు ఆగి చూస్తే తెలిసిపోతుంది

Exit mobile version