రామ్ లోని బీస్ట్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా?

Published on Sep 18, 2023 3:32 pm IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకడు. మరి రామ్ ఇప్పటివరకు ఓ లవర్ బాయ్ గా కొన్ని మాస్ రోల్స్ కూడా చేసాడు కానీ ఇస్మార్ట్ శంకర్ నుంచి అయితే తన మాస్ లోని సరికొత్త కోణం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ మాస్ రోల్స్ నుంచి రామ్ అయితే ఇప్పుడు చేస్తున్న “స్కంద” లో మాత్రం ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి.

ఇది వరకే ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే రామ్ సరికొత్త అవతార్ అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ట్రైలర్ లో మరో ఊహించని వెర్షన్ ని బోయపాటి ప్రెజెంట్ చేయడం ఒకింత ఆసక్తిగా అనిపించింది. ఇక ఈ పాత్రపై వచ్చిన లేటెస్ట్ సాంగ్ లో చూసినా కూడా ఈ రోల్ చాలా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడు అని అర్ధం అవుతుంది. మరి ఇంత హైపర్ రోల్ లో అయితే రామ్ చేయడం ఇదే తొలిసారి మరి బిగ్ స్క్రీన్స్ మీద ఇది వర్కౌట్ అవుతుందో లేక బోయపాటి రెగ్యులర్ సినిమాల్లానే అనిపిస్తుందా అనేది రిలీజ్ వరకు ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :