“డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా?

“డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా?

Published on May 14, 2024 2:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫాం చేసింది. అదే తరహా లో డబుల్ ఇస్మార్ట్ కూడా పెర్ఫాం చేస్తే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం రామ్ కెరీర్ లో మరో కీలక రాయిగా మారనుంది. అయితే అటు పూరి జగన్నాథ్ కి, ఇటు రామ్ కి ఈ సినిమా కీలకం. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. మే 15 న రిలీజ్ కానున్న టీజర్ సినిమా పై ఎలాంటి అంచనాలను సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు