మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించనున్న రవితేజ?

Published on Sep 29, 2021 2:40 pm IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. గాడ్ ఫాదర్ చిత్రం లో నటిస్తూ బిజిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాబీ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడింది. అయితే ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ హీరో రవితేజ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు కూడా ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడలేదు. ఒకవేళ రవితేజ ఈ చిత్రానికి అంగీకరిస్తే అటు రవితేజ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :